UPDATES  

 గాలి, వర్షంతో కుప్ప కూలిన ఇల్లు వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు.. 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , మార్చి 19..

తుఫాను ప్రభావంతో శనివారం రాత్రి మండలంలో సంభవించిన భారీగాలి, భారీ వర్షంతో కొత్త దంతనం గ్రామంలో రేకుల ఇల్లు కూలి అందులో నివసిస్తున్న ఇద్దరు పేద వృద్ధ దంపతులు గాయాల పాలైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు శనివారం రాత్రి భారీ స్థాయిలో ఈదురు గాలులతో భారీగా వర్షం పడింది .ఈ సమయంలో కొత్త దంతెనం గ్రామానికి చెందిన సాకర్ల ప్రసన్న రావు 65 వయస్సు, సాకర్ల రమణ 60 వయసు తమ రేకుల ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రసన్న రావు కి కాలికి బలమైన గాయం తగలడంతోపాటు కొన్నిచోట్ల స్వల్ప గాయాలయ్యాయి భార్య రమణమ్మ కి చేతి వేలికి తీవ్ర గాయం అవ్వగా ఇది గమనించిన బంధువులు చుట్టుపక్క వారు హుటాహుటిన కూలిన ఇంట్లో చిక్కుకొని ఉన్న వీరిని బయటకు తీసి కాపాడారు. గాయాలతో బాధపడుతున్న వీరిని ఉదయం భద్రాచలం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా ప్రసన్న రావు కాలు ఎముక పెరిగినట్లు తెలిసింది ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ చికిత్స పొందుతున్నారు ఇలా ఉండగా ఇంటి స్థలం తప్ప మరే ఇతర ఆధారం లేని ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా చిన్న కుమారుడు మరణించగా పెద్ద కుమారుడు భరత తిరువూరు ప్రాంతంలో పని నిమిత్తం వెళ్లి అక్కడే ఉంటున్నాడు దీంతో ఈ వృద్ద దంపతులిద్దరే దంతేనo  గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉండగా పేద దళితులైన వృద్ధులపై ప్రకృతి రూపంలో ఇలాంటి గండం వచ్చి పడింది పూటగడమే కష్టంగా ఉన్న ఈ వృద్ధ దంపతులను దాతలు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేసారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !