మన్యం న్యూస్ వాజేడు మార్చి 19
ములుగు జిల్లా వాజేడు మండలంలో గొల్లగూడెం, ధర్మవరం, పేరూరు, చందుపట్ల, చెరుకూరు వాజేడు జంగాలపల్లి, పలు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షాలకి కల్లాలలో ఆరబోసిన మిర్చి తడిసిపోయాయి, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట తడిసిపోయిందని అకాల వర్షం రైతులను నిండా ముంచిందని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మిర్చి వేసిన రైతులకు ఒక్క అవకాశంగా మార్కెట్లో స్వల్పపాటి గిట్టుబాటు ధరలు పెరిగి అన్నదాతలు కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇంతలో ప్రకృతి అన్నదాతలపై కన్నెర్ర చేసింది. అంతే రైతు కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి. ఎక్కడ చూసినా వర్షమే ఎన్ని బరకాలు కప్పిన ఎర్రని బంగారం నేలపై కన్నిల్లని తెప్పిస్తుంది.వాజేడు మండల వ్యాప్తంగా దాదాపుగా ఇదే కనిపిస్తుంది., అకాల వర్షం అతలాకుతలం చేయడమే కాకుండా చేతికొచ్చిన పంటను చేజార్చుకున్నా రైతాంగానికి అపార నష్టం జరిగింది. ప్రభుత్వ రైతు పక్షాన దృష్టి సారించి పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు