- టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ పై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను సజీవ దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మన్యం న్యూస్,అన్నపరెడ్డిపల్లి మార్చి 19: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆదివారం అన్నపరెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనమా గాంధీ అధ్యక్షతన,టీపీసీసీ మెంబర్ జడ్పిటిసి ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి హాజరై రాష్ట్రంలోనీ టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం టీపీసీసీ మెంబర్,ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి మాట్లాడుతూ టీఎస్.పీ.ఎస్సీ ప్రశ్న పత్రాల పేపర్ల లీకేజీ పై సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సున్నం నాగమణి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది ఉద్యమకారులు,విద్యార్థులు ప్రాణాలు ప్రాణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ జీవితాలుగా ఆగమైపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్త పరిచారు.నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో ఆటాడుకునే బిఆర్ఎస్ ప్రభుత్వన్ని వెంటనే భర్తరప్ చేయాలని రాష్ట్ర గవర్నర్ ని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు,గ్రామస్థులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.