మన్యంన్యూస్,ఇల్లందు టౌన్ మార్చి 19 ఇల్లందు పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద గల ఐత వారి ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన అయితా శ్రావణ్ దంపతుల కుమారుడి ప్రథమ పుట్టినరోజు వేడుకలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా రైతుబంధు కమిటీసభ్యులు పులిగండ్ల మాధవరావు, టీబీజీకేఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షుడు ఎస్. రంగనాథ్, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ తివారి, పట్టణ కమిటీ సభ్యులు కుంట నవాబ్, ఎస్కే. పాషా, ఇల్లందు మండల ఇంచార్జ్ యలమద్ది రవి, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, యువజన నాయకులు సుమన్ పాల్గొన్నారు.
