మన్యం న్యూస్, మంగపేట. మార్చి 19
మంగపేట మండల చింతగుంట గ్రామపంచాయతీ కి చెందిన మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు దోమెడ గ్రామ ఉపసర్పంచ్ చింతకుంట గ్రామానికి చెందిన బండ్ల ముత్యపు రావు కుమారుడు బండ్ల గురుమూర్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆదివారం వారి దశదిన కర్మలకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ సభ్యురాలు డాక్టర్ సీతక్క కుమారులు తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు ధనసరి సూర్య. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు మండల మీడియా ఇంచార్జి కర్రీ నాగేంద్రబాబు, సీనియర్ నాయకులు కొమరం నరేష్, కొమరం కన్నయ్య, మహమ్మద్ అష్రఫ్, అచ్చాలు,జాడి సమ్మయ్య, కొమరం సూర్యం, కేశవరావ్, అంజయ్య, బండ్ల రాంబాబు, కొమరం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.