మన్యం న్యూస్,ఇల్లందు టౌన్: మార్చి 19 ఇల్లందులోని ఎల్లన్న విజ్ఞాన భవనంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నాయిని కృష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి టీపఎండబ్లుయూ జిల్లా కార్యదర్శి షేక్.యాకూబ్ షావలి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ యాకుబ్ షావలి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(టిపియండబ్ల్యూయు) ఇఫ్టూ అనుబంధ జిల్లాప్రధమ మహాసభలను ఏప్రిల్ రెండవతారీఖున ఇల్లందులోని చండ్ర కృష్ణమూర్తి (ఎల్లన్న) విజ్ఞానకేంద్రంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మహాసభను జయప్రదంచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈమహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలపై, కార్మిక సమస్యలపై పోరాటాలకు సిద్ధం చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల రాష్ట్రనాయకులు వేముల గురునాథం, సిహెచ్. కుమార్, ఎం.డి. ఫయాజ్, సంజీవ్, బోయపోతుల వెంకన్న, బాలాజీ, రాజు, ఉపేందర్, సురేష్ పాల్గొన్నారు.