మన్యం న్యూస్ కరకగూడెం మార్చి 19 విద్యార్థుల ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని,ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
ఆదివారం భట్టుపల్లి రైతువేదికలోని సోటకన్ కరాటే ఆకాడమి ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు.గ్రేడింగ్ పోటీలో దాదాపు 30 మంది విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభా పాటవాలను కనబర్చిన విద్యార్థులకు గ్రేడింగ్ బెల్టులు, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ రేగా కాళిక,తెలంగాణ రాష్ట్ర సోటకన్ కరాటే ఆకాడమి ఛైర్మన్ చంద్రశేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇటీవల కాలంలో బాలికలు,మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు.ఈ పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచే బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చించాలని తెలిపారు.పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.కేవలం చదువే కాకుండా విద్యార్థులను క్రీడల వైపు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వాలు కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరాటే డైరక్టర్ పాయం సురేష్,స్థానిక కరాటే మాస్టర్లు లావణ్య,ఆఫ్రోజ్,వెంకటేశ్వర్లు,కరాటే విద్యార్థులు,మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.