మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 20: మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఊట్లపల్లి సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయ్ సోమవారం ప్రారంభించారు. ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని అన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ డాక్టర్ రాందాస్, హెచ్ఏఎం గోపాల్, ఎంఎల్హెచ్పి ఎస్కె రుష్కనా, మాదాస బాప్తలీక, అసిస్టెంట్ సుధారాణి, వార్డ్ నంబర్స్, ఆశా వర్కర్స్, పంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామస్థలు
మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.