మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 20 మండల పరిధిలోని భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాందీ పాఠశాలలో విద్యార్థులకు ఆయుష్ విభాగం అర్ డిడి ఆదేశాల మెరక ఆయుర్వేద డాక్టర్ సిఎచ్ కుమార్ స్వామి అధ్వర్యంలో ఎంపీపీ రేగా కాళికా చేతుల మీదుగా నూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ పాఠశాల పిల్లలు మానసిక ఒత్తిడిని తగ్గించి, జ్ఞాపక శక్తిని పెంచేందుకు, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినులకు నుట్రీషన్ కిట్లు మిగతా వ విద్యార్థులకు రాగి లడ్డూ పంపిణి చేయడం జరిగింది.అదే విధంగా పిల్లల కు ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఎంమ్ఎన్ఓ,నగేష్,స్థానిక సర్పంచ్ తోలెం నాగేష్,ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి పాల్గొన్నారు
