UPDATES  

 ఇల్లందు మున్సిపాలిటీలో 2023 – 24 బడ్జెట్ పాల్గొన్న ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్..

మన్యం న్యూస్ ఇల్లందు టౌన్ మార్చి 20:ఇల్లందు మున్సిపాలిటీలో 2023 – 24 సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన రూ.40.68 కోట్ల బడ్జెట్ ను స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్,ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కౌన్సిలర్లతో కలిసి ఆమోదించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యువనేత మున్సిపల్ & ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇల్లందు పట్టణం గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎవ్వరూ చేయని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలోనే ఆదర్శమైన మున్సిపాలిటీగా పేరుగావించిందని తెలిపారు. ఇల్లందు మున్సిపాలిటీ 2023-24 వార్షిక బడ్జెట్ కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకాలని.. ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిచేయాలని కోరారు. ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించే వార్డు మెంబర్ల, ప్రజా ప్రతినిధుల ఆకాంక్ష మేరకు రానున్న రోజుల్లో‌ ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి‌, నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ లకు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ కమిషనర్ అంకు షావలి, వార్డు కౌన్సిలర్లు, కటకం పద్మావతి, సయ్యద్ ఆజం, ఎలమందల వీణ వాసు, రేళ్ళ నాగలక్ష్మి, జెకె శీను, మొగలి లక్ష్మీ, అంకెపాక నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, పత్తి స్వప్న, కో ఆప్షన్ సభ్యులు నాగమణి, మున్సిపల్ అధికారులు, డిఈ రచ్చ రామకృష్ణ, ఏవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్,సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్, మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !