మన్యం న్యూస్ గుండాల మార్చి 20: ఆళ్లపల్లి మండలం పరిధిలోని నడిమిగూడెం పంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పిటిసి హనుమంతరావు, సర్పంచ్ నరసింహారావు రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వారు అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ప్రతి పంచాయతీ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు ఖండే దేవేందర్ ,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
