మన్యం న్యూస్ దుమ్ముగూడెం: మార్చి 20
మండల పరిధిలోని ఆంధ్ర కేసర్ నగర్ సమీపంలో గల ఓ కూల్ డ్రింక్ షాప్ లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది శ్రీనగర్ కాలనీకి చెందిన నాగరాజు ముత్యాలు దంపతులు గత రెండు సంవత్సరముల క్రితం బ్రతుకుతెరువు కోసం ఆంధ్ర కేసరి నగర్ సమీపంలో గల ప్రధాన రహదారి పక్కన చిన్నపాక వేసుకుని సోడాబండి కూల్ డ్రింక్స్ ఇతరత్రా చిరుదిండ్లు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నారు ఇదే క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయం వరకు షాపులో ఉన్న వీరు సమీపంలో ఉన్న తమ స్వగ్రామం శ్రీనగర్ కాలనీలో ముత్యాలమ్మ జాతర చూసేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు రాత్రి 12 గంటల వరకు జాతరలో గడిపిన ఈ భార్యాభర్తలు ఇరువురు తిరిగి తమ షాపు వద్దకు నిద్రించేందుకు వచ్చారు ఈ క్రమంలో షాపు తాళం పగలగొట్టి కనిపించడంతో కంగారుపడ్డ మీరు షాపు డోర్ తీసి లోపలికి వెళ్లి గమనించగా వీరు వంట చేసుకునేందుకు తెచ్చి పెట్టుకున్న వంట గ్యాస్ సిలిండర్ తోపాటు దుకాణంలో అమ్మేందుకు ఉంచిన పలు రకాల వస్తువులు సుమారుగా 10 వేల రూపాయల విలువచేసే సామాన్లు ఎత్తుకెళ్లినట్టు గమనించారు ఈ విషయాన్ని సోమవారం ఉదయం స్థానిక దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ చోరీపై ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.