మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 21 : మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల వైద్యధికారి తన్మయి అధ్యక్షతన మంగళవారం కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కూరం ప్రమీల ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల వైద్యాధికారి తన్మయి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు కంటి సమస్యతో బాధపడుతున్న వారు కంటివెలుగు శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షలు చేసిన తర్వాత కంటి సమస్యలు ఉన్నవారికి అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి,పంచాయతీ కార్యదర్శి గురునాథం,హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు,ఎంహెచ్ఎల్పి హేమలత, ఏఎన్ఎం లక్ష్మి,జయలక్ష్మి ఆశా వర్కర్లు గ్రామస్తులు కొత్తూరు వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
