మన్యం న్యూస్, పినపాక, మార్చి 21…
తెలంగాణ ముఖ్యమంత్రి పేదింటి మేనమామ లాగా ఆడబిడ్డల కళ్యాణం కోసం కళ్యాణ లక్ష్మి రూపంలో ఆర్థిక సాయం చేస్తున్నారని. దీని కారణంగా గతంలో జరిగిన బాల్య వివాహాలు రద్దు అయ్యాయని. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి అండగా నిలుస్తుందని తాజాగా పినపాక మండలానికి 24 కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు మంగళవారం పినపాక మండల పరిధిలోని పినపాక, పోట్లపల్లి సీతంపేట, గోపాల్ రావు పేట, తదితర గ్రామాలలోని లబ్ధిదారులకు 14 చెక్కులను ఆయన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. జానంపేట పరిధిలో పది కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరవగా రైతు వేదికలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి తెలంగాణ ఆడబిడ్డల వివాహానికి ఆసరాగా నిలుస్తూ, భరోసాను అందిస్తుందని తెలియజేశారు. లబ్ధిదారులు ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి సాయాన్ని మరువలేరని, ఆయనను దైవం మాదిరిగా పూజిస్తున్నారని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అర్హులకు సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, భవాని శంకర్, బుల్లిబాబు, కామేశ్వరరావు, బత్తుల వెంకటరెడ్డి, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.