మన్యం న్యూస్, పినపాక, మార్చి 21
పినపాక సెక్టార్ పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్ సత్యవతి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట, ఉప్పాక అంగన్వాడీ కేంద్రంలో ఉన్న తల్లులకు పోషకాహారం గురించి వివరిస్తూ, తృణ ధాన్యాల ఆవశ్యకతను తెలియజేశారు. తల్లులు పిల్లలు పోషకాలతో కూడిన తృణధాన్యాల ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలియజేశారు. వారానికి రెండుసార్లు అంగన్వాడీలో తృణధాన్యాలను అందిస్తున్నామని, ప్రతి ఒక్క తల్లి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. దీనితోపాటు ఆహారానికి ముందు చేతులను శుభ్రపరచుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.