మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ మార్చి 21:ఇల్లందు పురపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న లేక్ పార్క్ పనులను మంగళవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,మున్సిపల్ కమిషనర్ అంకుష్ షావలి పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇల్లందు లేక్ పార్క్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని అతి త్వరలో ప్రజలకు లేక్ పార్క్ అందుబాటులోకి రానుందని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
