UPDATES  

 మహిళా సాధికారతలో సెర్ప్ పాత్ర ఎంతో కీలకం. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా చిత్రపటాలకు పాలాభిషేకం..

మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 21 జీవో నెంబర్ 11ను విడుదల చేస్తూ సెర్ప్ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ జీవో విడుదల చేసిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి గ్రామం లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్వగృహమైన కుర్నవల్లి గ్రామంలో సెర్ప్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి కృతజ్ఞతలు తెలిపారు సెర్ప్ ఉద్యోగులు,అనంతరం సెర్ప్ ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించినందున ఉద్యోగులకు జీవో నెంబర్ 11 వర్షింపచేస్తూ పేస్కేలు అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటానికి ఉద్యోగులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ

25 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 3974 మంది తాత్కాలిక సెర్ప్ ఉద్యోగులు గా ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు, వీరిలో 46 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు అన్నారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ సానుకులంగా స్పందించి చిరకాల కోరికను తీర్చి వారి కుటుంబాలలో వెలుగులను నింపారన్నారు. ఉద్యోగులంతా మరింత ఉత్సాహంతో పేదరిక నిర్మూలనకు మహిళా అభ్యున్నతికి కృషి చేయాలన్నారు, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమమైన వేతనాలు అందజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా,సెర్ప్ జెఎసి నాయకులు బచ్చలకూరి.ప్రసాద్,మడిపల్లి నాగార్జునరావు,గుజ్జుల.రాధా రెడ్డి,త్రిగుణ,మురళి,గిరి బాబు,ఆహ్మదుల్లా, ఝాన్సీ,శోభా, లక్ష్మి కాంత, సత్యనారాయణ, రాంకుమార్, రమేష్ , కళావతి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !