- కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం.
- సిబిఐ ఈడి లు మోడీకి పెంపుడు కుక్కల మారాయి.*
- రాష్ట్రంలో బిజెపికి ఉన్న నాలుగు స్థానాలను ఓడించడమే సిపిఐ లక్ష్యం.*
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాషాయ పార్టీకి స్థానం లేదు
- పాలకులకు కనువిప్పు కలిగించేందుకే ఏప్రిల్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు.
- జిల్లా విస్తృత సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 21… జాతి సంపదను దోచిపెడుతూ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్ను సాగనంపేందుకు ప్రజలు సిద్దంకావాలని *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, జగన్నాధపురంలో మంగళవారం ముత్యాల విశ్వనాధం అధ్యక్షతన జరిగిన సిపిఐ భద్రాది కొత్తగూడెం జిల్లా విస్తృత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న రైల్వే, ఎల్బీసి, బ్యాంకులు, బొగ్గు గనులు, విమానయానం వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీ లాంటి కుబేరులకు కట్టబెట్టి దేశాన్ని దివాలా అంచుకు చేర్చారని, కార్పోరేట్ల జపం వల్లిస్తూ ప్రజలను, దేశాన్ని ఆదోగతి పాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బంగడుపుకుంటోందని విమర్శించారు. లౌకిక, ఆర్థిక, సామాజిక రాజ్యాంగ సంస్థల విధ్వంసానికి కేంద్రం పూనుకుందని, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడమే పనిగా పెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఎనిమిదేల్ళ కాలంలో దేశంలో ఫాసిస్టు తరహా నిర్భందాలు హెచ్చమీరాయని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ వాటిపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్రతోనే వారిపై అవినీతి ఆరోపణలు రుద్దతూ ఈడీ, సిబీఐ, ఇన్ కంటాక్స్ సంస్థలను ఉసిగొల్పుతున్నారని, ఈ సంస్థలు మోడీకి పెంపుడు కుక్కల మారాయి విమర్శించారు. దేశ, రాష్ట్రాల ఫెడరల్ హక్కులను పరిరక్షించుకునేందుకు అన్ని శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో బిజెపికి ఉన్న నాలుగు స్థానాలను ఓడించడమే సిపిఐ లక్ష్యం అన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపిని అడుగు పెట్ట నియబోమని పునరుద్ఘాటించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా మాట్లాడుతూ* స్వరాష్ట్రం సిద్ధించి ఏండ్లు గడుస్తున్నా స్వరాష్ట్ర ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజల దరిచేరలేదన్నారు. ప్రజల బాగోగులు పక్కనపెట్టి మోడీతో కుస్తీతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలం వేల్లదీస్తోందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటింటికి నల్లా వంటి ప్రభుత్వ హామీలు నెరవేరడం లేదని అన్నారు. దేశంలో బిజెపిని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మె పరిస్థితి లేదని, కమ్యూనిస్టు పార్టీలే ప్రత్యామ్నాయమనే ప్రజల ఆలోచనకు మరింత బలం చేకూర్చాలిన భాద్యత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీకి రెండు దశాబ్దాలనాటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి ప్రమాదకరంగా మారిన బిజెపికి వ్యతిరేకంగా ‘బిజెపి కో హఠావో.. దేశ్ కో బచావో..’ నినాదంతో, అదేవిదంగా రాష్ట్రంలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పోడు భూములు, సాగునాటి ప్రాజెక్టుల సాధన, స్కీమ్ వర్కర్ల సమస్యలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు, సంఘంటిత, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా ఇంటింటికి సిపిఐ కార్యక్రమం ఏప్రిల్ 14 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*రాష్ట్ర కార్యవర్గం సభ్యులు బి. అయోధ్య* మాట్లాడుతూ జిల్లా నిర్వహించ యాత్ర పాలకులకు కనువిప్పు కలిగించే విధంగా చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర పాలకుల వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిర్యాల రంగయ్య, బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, సారయ్య, కల్లూరి వెంకటేశ్వర్లు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, ఏపూరి బ్రహ్మం, కమటం వెంకటేశ్వర్లు, sd. సలీమ్, నరాటి ప్రసాద్, వై. శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, చండ్ర నరేంద్ర కుమార్, వై. భాస్కర్రావు, ఆకోజు సునీల్ కుమార్* తదితరులు పాల్గొన్నారు.