మన్యం న్యూస్, అశ్వరావుపేట, మార్చి 21
అశ్వరావుపేటలోని స్థానిక ప్రభుత్వ బాలికల హై స్కూల్ నందు మంగళవారం పదవ తరగతి విద్యార్థినిలకు ఇమ్యూనిటీ కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు అనేక రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తుందని దానిలో భాగంగానే విద్యార్థులు ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని, ఆయుష్ అనే కార్యక్రమంలో బాగంగా ఈ ఇమ్యూనిటీ కిట్లను విద్యార్థులకు అందజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 50 లక్షల రూపాయలు ప్రత్యేక నిధులను కేటాయించాలని ఈ ఇమ్యూనిటీ కిట్లలో రాగి లడ్డు అలాగే ఇమ్యూనిటీ పౌడర్ ను అందిస్తున్నారని దీనివలన విద్యార్థులకు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుందని అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి దూరం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.