- ఇక బిజెపికి డెడ్ లైన్
- ప్రజా సమస్యలు గాలికొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
- రాజ్యాంగాన్ని ద్వంసం చేయడానికి బీజేపీ కుట్రలు
- సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- కొత్తగూడెం లో జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 21. ప్రజాసమస్యలు వదిలేసి ప్రజల మధ్య మత విశేషాలు రెచ్చగొడుతూ బిజెపి పాలన సాగిస్తుంది సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
సిపిఎం జనచైతన్య యాత్ర మంగళవారం కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్డు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కీ బాలరాజు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ
లౌకిక భావాల వ్యాప్తి కొరకు ప్రజలను చైతన్యం చేయడానికే జన చైతన్య యాత్ర జరుగుతుందని అన్నారు.కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, వంటి అంశాలపై దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో పరిపాలన చేస్తున్న బిజెపి తన అసలు ఏజెండా అయినా హిందుత్వ రాష్ట్ర స్థాపన కోసం హిందూ, ముస్లింలు, క్రైస్తవుల మధ్య మత ఘర్షణ సృష్టించి తమ రాజకీయ లక్ష్యం నెరవేర్చుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానంలో మనస్ఫూర్తిని రాజ్యాంగంగా తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని ఏకత్వ రాజ్యాంగ తయారు చేసే దానికోసం ప్రజలను కులం మతం ప్రాంతం పేరుతో విడదీస్తు విభజించు పాలించు అనే బ్రిటిష్ నినాదాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మరోవైపున దేశానికే తలమానికమైన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి దేశ సంపదను లూటీ చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజల కన్నా అంబానీ ఆదానీలపైనే ప్రేమ ఎక్కువగా ఉందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని తుంగలో తొక్కి కరోనా సమయంలో ఉన్న ఉద్యోగాలనే ఊడపీకారని ఆయన అన్నారు. అదానీ ఆస్తుల గురించి హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తానన్న డబుల్ బెడ్ రూం పథకం కూడా సరిగా అమలు కాలేదని ఆరోపించారు. ఖాళీ స్థలం ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం పది లక్షలు,రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ,భారత్ రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చే కుట్రలు చేస్తుందని విమర్శించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతీనేని సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవినీతి పరులకు అరాచక శక్తులకు అండగా ఉంటుందని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ పెదలపై భారాలు మోపుతుందనీ విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం సిపిఎం తన వంతు కర్తవ్యంగా జన చైతన్య యాత్ర నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు,ఏజే రమేష్, కే పుల్లయ్య,యం బి నర్సారెడ్డి, బ్రహ్మచారి,జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ,కొండపల్లి శ్రీదర్, రేపాకుల శ్రీనివాస్ దొడ్డా రవికుమార్, నభి,భూక్యా రమేష్,యు నాగేశ్వరరావు, కొండబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు