మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 23:కంటి చూపులో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడంలో ఆప్టోమెట్రిస్ట్ పాత్ర అమోఘం అని తిప్పనపల్లి ఎంపీటీసీ లంక విజయలక్ష్మి అన్నారు. గురువారం తిప్పనపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. అనంతరం ప్రపంచ ఆప్టోమెట్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని. ఎంపీటీసీ దంపతులు లంక విజయలక్ష్మి, నర్సింహారావు, ఆప్టోమెట్రీస్ట్ ఏం వెంకట సుబ్బలక్ష్మి (రేఖానా) ను శాలువాలతో ఘనంగా సత్కరించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మనిషి జీవితంలో కంటి చూపు చాలా ముఖ్యమైందన్నారు. కంటికి ఏర్పడే చిన్న చిన్న సమస్యలను ఆప్టోమెట్రీస్ట్ లు గుర్తించి సమస్యను పరిష్కరించి. ప్రపంచాన్ని మెరుగ్గా చూపించడంలో వీరి పాత్ర అమోఘం అన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలు చిన్న చిన్న సమస్యలతో కంటి చూపును కోల్పోతున్నారని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని 18 సంవత్సరాలు నిండిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు రఘునాథ్ సాయిబాబు, డిఇఓ నీలిమ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల రైతు కో ఆర్డినేటర్ గాదె లింగయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మాజీ సర్పంచ్ గుగులోత్ రమేష్ నాయక్, గ్రామ అధ్యక్షుడు కల్లెం వెంకటేశ్వర్లు, అంచె అప్పారావు, హెచ్ వి పద్మా, ఏఎన్ఎంలు శాంతి, శ్రీదేవి, ఆశాలు లక్ష్మి, రాములమ్మ, జయ, లక్ష్మి, రాంబాయి, గ్రామస్తులు సయ్యద్ సబ్జర్, నర్సి వెంకటేశ్వర్లు మహిమద్, కొండ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
