మన్యం న్యూస్, మణుగూరు, మార్చి23: టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం సేవ్ జర్నలిజం డే ను యూనియన్ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి చంద్రశేఖర్ ,కార్యదర్శి సత్యనారాయణ, నాగేశ్వరావుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ నాయకులు భగత్ సింగ్, అతని అనుచరుల బలిదానాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమన్ని నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యక్షుడు పూజారి చందు నివాళులు అర్పించారు. సేవ్ జర్నలిజం డే అంటూ ప్లకార్డ్ లు పట్టుకొని నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో పిండిగ వెంకట్, విజయ్,ఉపేందర్, సత్యంబాబు, రవితేజ, రవి, చారి, సాయిరాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
