మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారన్న భయంతో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డ డానియెల్ లను ఇల్లందు పోలీసులు గురువారం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర వల్లనే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వదిలి తొమ్మిదేళ్ల పరిపాలనలో తొలిసారి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఖమ్మం జిల్లాకు వస్తున్నారన్నారు. భద్రాచలం ముంపుకు గురైనప్పుడు వేయి కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేస్తానన్న మాట మరచిన కేసీఆర్ ఇప్పుడు కూడా అకాల వర్షానికి దెబ్బతిన్న పంటనష్ట నివారణ చర్యలో భాగంగా సుష్క హామీలు ఇవ్వకుండా రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పులి సైదులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాంబ, మహేష్ ,యాదవ్ తదితరులు ఉన్నారు.
