UPDATES  

 బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి..

మన్యంన్యూస్,ఇల్లందు టౌన్.. బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా నాదెండ్ల శ్రీనివాసరెడ్డి నియామకమయ్యారు. గతంలో పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కొక్కు నాగేశ్వరరావు పలుకారణాల వలన రాజీనామా చేయటంతో ఖాళీగా ఉన్న ఈ పదవిని ఎమ్మెల్యే హరిప్రియ గురువారం భర్తీ చేస్తూ శ్రీనివాసరెడ్డిని నియమించారు. అలాగే ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనోహర్ తివారిని నియమించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు చేతులమీదుగా వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ జెకే.శ్రీను తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !