మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి23 : గ్రామీణ ప్రాంతంలో నిర్వహించే క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు.. గురువారం అయ్యన్నపాలెం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఆద్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీల విజేతలకు ఆమె బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడా కారులనుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ….యువకుల క్రీడల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. క్రీడల్లో రాణించటం ద్వారా భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు, తుమ్మలపల్లి సురేష్, రామరాజు, వారాధి సత్యానారయణ, చాపమడుగు లక్ష్మణారావు, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, యువజన విభాగం బాద్యులు పాల్గొన్నారు.
