మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి 23: బీసీల ఐక్యత కోసం కృషి చేస్తానని జాతీయ బిసీ సంక్షేమ సంఘం అశ్వరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు పల్లె వీరప్రసాద్. అన్నారు. గురువారం బిసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని వీరప్రసాదు అందజేశారు.ఈ సందర్భంగా పల్లె వీరప్రసాద్ మాట్లాడుతూ…..బిసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిసి యువతకు ఉపయోగపడేలా కృషి చేస్తానన్నారు. బీసీ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిసీ సంఘం జిల్లా యువజన ఉపాధ్యక్షుడుబండి శ్రీకాంత్,మండల నాయకులు పాల్గొన్నారు.
