మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు అశ్వాపురం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు గుమ్మడి.అరుణ ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి లోని కస్తూర్బా పాఠశాల లో గురువారం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ విచ్చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు అరుణ మాట్లాడుతూ, విద్యార్థినులకు పోషకాహారంగా రాగిలడ్డూలు,మెమరీ బూస్టర్ అయినటువంటి బ్రహ్మీ గ్రాన్యూల్స్ అందిస్తున్నామని, విద్యార్థులందరూ ఉపయోగించాలని కోరారు. రాగి లడ్డుు రక్తహీనత నుంచి బాలికలు దూరంగా ఉంటారని , బ్రాహ్మీ గ్రాన్యుల్స్ వలన వలన విద్యార్థినులలో ఏకాగ్రత మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు అని వివరించారుు. సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం యొక్క విశిష్టతను, జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించి ఆయుష్ ఆరోగ్యకర దీపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఆయుష్ సిబ్బంది రాధిక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.