UPDATES  

 అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు..ప్రత్యేక పూజలు చేసిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.

  • అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు..
  • ప్రత్యేక పూజలు చేసిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి_
  • వినయ్ కుమార్ రెడ్డి ట్రస్టు చైర్మన్ నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు

 

మన్యం న్యూస్, మంగపేట.

నూతన తెలుగు సంవత్సరాది శోభ కృతు నామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బుధ వారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆకినెపల్లి మల్లారం టి కొత్తగూడెం జంట గ్రామాల భక్తులతో ఆలయం కిట కిట లాడింది ఈ సందర్భంగా జాతీయమిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకుల నుండి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పంచాంగ శ్రవణం చేశారు.తెలుగు సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం సందర్బంగా ఉగాది పచ్చడి ని స్వీకరించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా శోబకృత్ వ్యవసాయ రంగానికి ముఖ్యంగా రైతులకు మంచి జరగాలని, సమృద్ధిగా వర్షాలు కురియాలని, దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయ ఆంజనేయ ఆలయం దాతలు,నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి రమణమ్మ దంపతులు ట్రస్టు సభ్యులు భార్గవ్,నాగిరెడ్డి,కృష్ణారెడ్డి, శేషారెడ్డి, దూలగొండ నారాయణ, తిరుపతిరావు, ప్రసాద్, పాడి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !