మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఇల్లందు పురపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న మల్టీ యుటిలిటీ సెంటర్ ను గురువారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఇటీవలే మల్టీ యుటిలిటీ సెంటర్
పై భాగము స్లాబు వేసి సెంట్రింగ్ తీసేసిన అనంతరం బిల్డింగ్ నిర్మాణాన్ని చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలిపారు. నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ ఆజం, బారాస పట్టణ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, బారాస నాయకులు అక్కపల్లి సతీష్, పెద్దినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.