UPDATES  

 మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులు ..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలనలో భాగంగా గురువారం తెల్లవారుజామున అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్టు చేసారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య, ఇదీ మీ నియంత దోరణికీ పరాకాష్ఠ. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కని, ఆ హక్కును బిఆర్ఎస్ ప్రభుత్వం కాలరాయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇలాంటి నిర్బంధాలు చూడలేదని బిఆర్ఎస్ పాలన నియంత పాలన తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ తప్పిదాలను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోందన్న భయంతోనే పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేయించి . ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి, పాలన కొనసాగించుకోవాలనుకోవడం సరైంది కాదని తెలిపారు. ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించడం చూస్తే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా.? లేక నిరంకుశత్వంలో ఉన్నామా, అర్థం కావడం లేదు అన్నారు అక్రమ అరెస్టులను కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవని కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండ ఉంటుందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నకేశవరావు, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మహేష్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి జల్లిపల్లి దేవరాజ్, లను ముందస్తుగా అరెస్టులు చేసారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !