- ఇల్లందు మున్సిపాలిటీలో మళ్ళీ కొత్త ఆటమొదలైంది
- అసమ్మతి కౌన్సిలర్ల్స్ పై పరోక్షoగా దాడులు మొదలు పెట్టిన పార్టీ పెద్దలు
- కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే…కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాస హైడ్రామా ఇప్పుడు కొత్త మలుపు తిరిగి రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ సీనియర్ నాయకులు, స్థానిక 19వ వార్డు మహిళా కౌన్సిలర్ పత్తి స్వప్న భర్త రంజిత్ ను సింగరేణి అధికారులు ఇల్లందు నుంచి వేరొక ప్రాంతానికి బదిలీ చేస్తూ ట్రాన్స్ఫర్ రావడంతో మున్సిపల్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తన భార్య పత్తి స్వప్న ఇల్లందు పాలక వర్గంలో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించడంతో అది మింగుడుపడని కొందరు ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు జేకే 5 ఓసి గనిలో పనిచేసే తనను హఠాత్తుగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసనీ ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇల్లందు మున్సిపాలిటీలో పెద్దమనిషిగా వ్యవహరించే వ్యక్తి వార్డులకు నిధులను ఇవ్వకుండా ఆయన అనుకూల వర్గానికే నిధులను మంజూరు చేస్తూ పైగా ఇదేమిటని ప్రశ్నించిన మహిళా కౌన్సిలర్లను కులం పేరుతో దూషించటంతో అసమ్మతి తెలిపామని అన్నారు. దీంతో మున్సిపాలిటీలోని కొందరు మహిళా కౌన్సిలర్ లను ఇటీవల వరంగల్ పట్టణంలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుని నివాసం నందు స్థానిక ఎమ్మెల్యే, ఇరువురు రాష్ట్ర నాయకులతో ఇల్లందు పట్టణ అసమ్మతి కౌన్సిలర్లను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా చర్చల అనంతరం రాష్ట్ర నాయకుని సమక్షంలో తను అతని భార్య కలిసి బదిలి గురించి ప్రస్తావించగా, బదిలీ లేకుండా చూసే భాధ్యత తీసుకుంటామని స్పష్టమైన హామీఇచ్చారని తెలిపారు.ఈ నేపథ్యంలో తను సింగరేణి అధికారులను, ఇల్లందు అగ్రనాయకులను కలిసి ఇట్టి విషయాన్ని ప్రస్తావించగా, అందుకు వారు మాటలతో బుకాయిస్తూ అది ఇక్కడి నుంచి వచ్చింది కాదు పైనుంచి వచ్చింది అని మాటలు దాటేయడం జరిగిందని ఆరోపించాడు.పట్టణానికి చెందిన మరొక నాయకుడునీ వెళ్లి అడిగితే మీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే తను అతని భార్య వెళ్లి పెద్దనాయకుల కాళ్లు పట్టుకుంటే తప్ప బదిలీ ఆపడం కుదరదు అని కరాఖండిగా చెప్పడం జరిగిందని కాళ్లు పట్టుకునే అంత తప్పు నేనేం చేశాను అంటూ పట్టి రంజిత్ గోడు వెళ్లబోసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన తన భార్య పత్తిస్వప్న, తాను తెలంగాణ ఉద్యమం నుంచి బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడం తప్పా అని ప్రశ్నించారు.ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అధికార పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్ భర్తగా తనకే న్యాయం జరగకపోతే ఇక ఇల్లందు పట్టణ ప్రజల సంగతి ఏంటి అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సరిగ్గా రెండు మాసాలు అవుతుంది నాకు ఉద్యోగం లేక నా కుటుంబం గడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకు మేము ఎంతో మనోవేదనకు గురవుతున్నామని బదిలీ విషయమే కాకుండా నాకు కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపారు. దీనిని చొరవ తీసుకొని తాను ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వారిని తన ఇంటి మీదికి ఉసిగొల్పి వారితో తనను అతని భార్యను కుటుంబాన్ని ఎస్సీ దలితులం అయిన మమ్మల్ని దుర్బాషలడుతూ డబ్బులు ఇస్తావా లేదా రోడ్డు మీదకు లాగాలా అని వేధించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే తనను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా,తన ఇంటి మీదకు వచ్చి కుటుంబాన్ని వేధిస్తే నేను తన కుటుంబం మొత్తం, ఆత్మహత్య చేసుకుంటామని.. దీనివెనుక ఎవరైతే కుట్రలు చేపిస్తున్నారో వారి పేర్లు రాసి చావడం మాత్రం తథ్యమని బీఆర్ఎస్ నాయకులు రంజిత్ అన్నారు.