మన్యం న్యూస్ గుండాల మండలం పరిధిలోని మామ కన్ను గ్రామంలో గల ఏకలవ్య పాఠశాలను ఇన్చార్జ్ ఆర్ సి ఓ డేవిడ్ రాజ్ గురువారం సందర్శించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థుల సామర్థ్యాన్ని ఆయన పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదివే ప్రధాన కారణమని అన్నారు. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యుత్ తో పాటు అనేక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా విద్యార్థులు ముగ్గు చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంధ్యారాణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
