UPDATES  

 పాత్రికేయుల వృత్తి వేతన భద్రత హక్కులను పరిరక్షించాలి…

మన్యం న్యూస్ కరకగూడెం:పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, హక్కులను అస్తిత్వాన్ని పరిరక్షించాలని పాత్రికేయుల వృత్తి, వేతన భద్రత, హక్కులను పరిరక్షించాలని, పాత్రికేయులపై దాడులను అరికట్టాలని కోరుతూ మార్చి 23న దేశవ్యాప్తంగా సేవ్​ జర్నలిజం డే ను నిర్వహించాలని ఐజేయూ (ఇండియన్​ జర్నలిస్టు యూనియన్​) పిలుపునిచ్చింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కరకగూడెంలో టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ) పినపాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు తిప్పని. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల జర్నలిస్టులు ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా పాత్రికేయుడుగా పనిచేసి ఎన్నో రచనలు చేసిన అమరవీరుడు సర్దార్ భగత్​సింగ్​, ఆయన సహచరులు అమరులు రాజగురు,సుఖ్​దేవ్​ దేశమాత స్వేచ్ఛ కోసం ధైర్యంగా ఉరికంబాన్ని ముద్దాడి ఆత్మబలిదానం చేసిన మార్చి 23ను వారి పోరాటస్ఫూర్తితో సేవ్​ జర్నలిజం డే పాటించాలని మార్చి 18–19 తేదీల్లో ఛండీగఢ్​లో సమావేశమైన ఐజేయూ జాతీయ కార్యవర్గం నిర్ణయం తో కరకగూడెం మండలం లో సేవ్ జర్నలిజం డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఫరూఖ్,ఇల్లందుల.సురేష్, బుడగం ప్రవీణ్,అఫ్రోజ్, సాయికిరణ్,రఫీ,బిక్షపతి, ప్రేమ్,మోహంత్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !