మన్యం న్యూస్ గుండాల..: మండలంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో అకాల వర్షానికి మొక్కజొన్న, తిరుగుడు పంటలు దెబ్బతిన్నాయని పంట సర్వే నిర్వహించి నష్టపరిహారాన్ని రైతాంగానికి అందించాలని కోరారు. మొక్కజొన్న పంటకు ఎకరానికి 50వేల రూపాయలు పొద్దుతిరుగుడు పంటకు ఎకరానికి 25 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు మామిడి తోటలకు, మిర్చి చేర్లకు సైతం నష్టపరిహారాన్ని ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కందకట్ల సురేందర్, ఉకే బాబు, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పరిషిక రవి, వెంకన్న, మంగన్న , తదితరులు పాల్గొన్నారు
