జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తాాజగా ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు జరిగాయి. జాన్వీ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. ఎన్టీఆర్, జాన్వీ జోడీ అదుర్స్ అంటున్నారు అభిమానులు.
