మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
2023 సంవత్సరానికి గాను పర్ణశాల గోదావరి బోటు షికార్ , వాహన పార్కింగ్ ఆసీలు వసూలు లైసెన్స్ హక్కులు కల్పించేందుకు మార్చి 27వ తేదీన గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు గ్రామపంచాయతీ సర్పంచ్ తెల్లం వరలక్ష్మి తెలిపారు. ఈ పాటలలో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం కూడా కలిగి ఉంటేనే పాటల్లో పాల్గొనేందుకు అర్హులు అవుతారని గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదని బహిరంగ వేలం పాటలలో పాల్గొనదలచిన వారు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ తో పాటు 2023 సంవత్సరంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి గాని వీఆర్వో నుంచి గాని పొందిన 5 లక్షల రూపాయల సాల్వెన్స్ సర్టిఫికెట్ ఒరిజినల్ సమర్పించాలని . తెలిపారు హెచ్చు పాట పాడి పాట దక్కించుకున్న పాటదారులు మూడు రోజులలోపాట పాడిన మొత్తంలో 70 % నగదుని గ్రామపంచాయతీకి చెల్లించి నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ పై గ్రామపంచాయతీ తో అగ్రిమెంట్ చేసుకోవాలని పాట మిగిలిన మొత్తాన్ని 90 రోజులలో పూర్తిగా చెల్లించాలని తెలిపారు ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల హెచ్ఘు పాట పాడిన పాటదారుడు తమ డిపాజిట్ ని కోల్పోవలసి ఉంటుందని ఆమె తెలిపారు గ్రామపంచాయతీ నిబంధన లోబడి ఈ బహిరంగ వేలం పాటలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.