మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలో జాతీయ టీబి దినోత్సవం సందర్భంగా నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం టీబీ వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో నీ టీబి రోగుల ఇంటి వద్దకు వెళ్లి టీబీ గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా టిబి వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. టిబి అనేది ప్రాణాంతకరమైన వ్యాధి కాదని మొదట్లోనే దానిని గుర్తించి సరియైన వైద్యం తీసుకుంటే సరిపోతుందని రోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, గుండాల మండల వైద్యాధికారి డాక్టర్ మనీష్ రెడ్డి, సిహెచ్ఓ శ్రీహరి, ఏఎన్ఎంలు అరుణ, శ్రీలత, నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.కె ఆజాద్, సభ్యులు కొండేటి సతీష్, కందుకూరి సంతోష్, బత్తిని వినయ్, కోడూరి ప్రణయ్, గామాలపాటి నరేష్,
