మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ప్రాజెక్ట్ అధికారి జయలక్ష్మి ఆధ్వర్యంలో పోశన పక్వాడ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులకు శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించి పోటీలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ, బహుమతులు అందజేశారు. అనంతరం చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.అలాగే కరకగూడెం అంగన్వాడి మూడవ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న వేడుకలు చేయించారు.చిరు ధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు భద్రమ్మ, సుశీల, పోషణ అభియాన్ బిసి కె నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి,ఎఎన్ఎమ్ లు,అంగన్వాడీ టిచ్చర్ లు విద్యార్థులు పాల్గొన్నారు.
