మన్యం న్యూస్, పినపాక:
పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుకోమ్మలని , పంచాయతీలలో సమస్యలు తీరితే రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.జాతీయ పంచాయతీ అవార్డులు , ప్రశంసా పత్రములు ప్రధాన కార్యక్రమం పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మండలంలో పది పంచాయతీలకు పంచాయతీ అవార్డులు , ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.
పినపాక,భూపాల పట్నం,పోట్లపల్లి,పాత రెడ్డి పాలెం, చెగర్శల,దుగినేపల్లి,సీతంపేట,మల్లారం,ఈ. బయ్యారం,గడ్డంపల్లి పంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు జాతీయ పంచాయతీ అవార్డులను అందజేశారు. అనంతరం సర్పంచులను సెక్రటరీలను సన్మానించి మెమెంటోలు అందజేశారు. అనంతరం కంప్యూటర్ ఆపరేటర్లను సైతం సన్మానించారు . సర్పంచులు, సెక్రెటరీలు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ఎంపీపీ గుమ్మడి గాంధీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీవో జైపాల్ రెడ్డి, సర్పంచులు, సెక్రటరీలు పాల్గొన్నారు .