UPDATES  

 డబుల్ ఇల్లు వచ్చే పేదవారు మురిసే..పేద ప్రజల పెద్దన్న కేసీఆర్.. రేగన్న కృషితోనే మా కల నెరవేరింది..

  • డబుల్ ఇల్లు వచ్చే పేదవారు మురిసే
  • పేద ప్రజల పెద్దన్న కేసీఆర్
  • రేగన్న కృషితోనే మా కల నెరవేరింది
  • డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల మనోభావం

మన్యం న్యూస్ గుండాల

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చి పేదవారి కల నెరవేరింది. ఏండ్లుగా అతి చిన్న గడ్డి ఇండ్లలో జీవనం గడిపిన పేద ప్రజలు డబ్బులు బెడ్ రూములు వారికి రావడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. మండలంలో గుండాల పంచాయతీకి మొత్తం 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్లు నిర్మాణం పూర్తి కావడంతో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఫిబ్రవరి 28వ తారీకు లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా అందించారు. ఎన్నో ఏళ్లుగా నిర్మాణం ఆగుతూ సాగుతూ ఉంది ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గెలిచిన తర్వాత వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయించారు. లబ్ధిదారులకు అందించాలని దృఢ సంకల్పంతో నిధులను మంజూరు చేయించి పూర్తి అయ్యే విధంగా ఎంతో కృషి చేశారు. మండలంలో మొత్తం 40 మంది నిరుపేదలను పార్టీలకు అతీతంగా ఎంపిక చేసి వారిని లాటరీ పద్ధతి ద్వారానే అందించారు.  పేదరికంతో ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక సామాన్యులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం అసాధ్యంగానే ఉంది. అలాంటివి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం తీసుకువచ్చిన మహోత్తర పథకం డబుల్ బెడ్ రూమ్ల ఇల్లు పథకం పేదవారు ఒక్క పైసా కూడా కట్టకుండానే స్థలంలోని ఇల్లు కట్టించి ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం 40 ఇళ్ళను అధికారులు ప్రారంభించి పూర్తి చేయించారు. గత పాలకుల హయములు ఆగుతూ సాగుతూ పోయిన పనులు రేగా కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పనులను వేగం చేశారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన 40 మందిని ఎంపిక చేసి అందించారు. మా సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, పూర్తి చేయించిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆజన్మంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు.

*కలలోకూడా అనుకోలేదు ఇల్లు వస్తదని ఈసం సరిత(దేవల్లగూడెం)*: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తదని కలలో కూడా అనుకోలేదు అని దేవల్లగూడెం గ్రామానికి చెందిన సరిత పేర్కొన్నారు. అక్కడ ఇక్కడ ఇల్లు వస్తున్నాయని వార్తలు విన్నాము తప్ప మాకు కూడా వస్తదని అనుకోలే ఇల్లు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది

*సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటాం ఆరెం సరిత (వేపల గడ్డ)*: సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని వేపల గడ్డ గ్రామానికి చెందిన సరిత అన్నారు. ఎన్నో ఏండ్లుగా పొంతింటి కోసం వేచి చూసామని ఇప్పటికీ స్వార్థమైందని ఆమె పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !