- మన్యంలో మట్టి మాఫియా
- పర్మిషన్ పేరుతో పట్ట పగలే మట్టి దందా
- 1/70 చట్టాన్ని ఉల్లంఘన చేస్తున్న అధికారులు
- షెడ్యూల్డ్ ప్రాంతంలో పీసా చట్టం ఊసే లేదు
- ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా..?
- షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు తూట్లు.
మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక, జంగాలపల్లి గ్రామం పరిధిలో, ప్రభుత్వ భూమిలో ఇదేచ్ఛగా భారీ యంత్రాల సహాయంతో మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఎటువంటి మైనింగ్ చేయడానికి ప్రభుత్వానికే పర్మిషన్ లేదంటూ, భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సాక్షిగా ఆధారాలతో చట్టం చెపుతున్న సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు ఏజెన్సీలో అక్రమంగా మట్టి తవ్వకాలకు పర్మిషన్ల పేరుతో ఏజెన్సీ ప్రాంతాన్ని, షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలను ఖూనీ చేస్తూ, ఇతర వ్యాపార వర్గాలకు మేలు చేస్తున్నారనే సంకేతాలు ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా వినబడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాల రక్షణకై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రాంత ప్రజలు ఆశ భావం వ్యక్తం చేశారు.
షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా ఉన్నప్పటికీ వాజేడు మండలంలో అమలుకు నోచుకోవడం లేదు అంటూ ఆదివాసి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిసా చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు పిసా గ్రామసభ తీర్మానం ద్వారా చేయాలని చట్టం స్పష్టంగా చెబుతున్న, సంబంధిత అధికారులు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పర్మిషన్ల పేరుతో మట్టి మాఫియా కి సపోర్టు చేస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. భూమికి సంబంధించి ఏ ఇతర క్రయవిక్రయాలు, మైనింగ్, లీజు సంబంధిత అంశాలు నిషేధం. అయినా అధికారుల అండదండలతో యదేచ్చగా వ్యాపారాలు చేస్తున్నారు.
ఆదివాసి చట్టాలు దృఢమైన చట్టాలుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం చట్టాలకు రక్షణగా అధికారులను నియమిస్తే, కంచె చేనును మేసినట్లు, అధికారులే చట్టాలని నిర్వీర్యం చేస్తున్నారని బహిరంగంగానే ఆదివాసి చట్టాలను హత్య చేస్తున్నారని, ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తహశీల్దార్ వాజేడు
మండలంలో మండపాక గ్రామ పరిధిలో మట్టి తవ్వకాల కు ఏడి మైనింగ్ ములుగు పర్మిషన్స్ ఇచ్చారు. తహసిల్దార్ కార్యాలయం వాజేడు నుంచి ప్రోసిడింగ్ మాత్రమే ఇచ్చామని తెలిపారు.
తుడుందెబ్బ జిల్లా నాయకులు చిరంజీవి
వాజేడు మండలంలో మట్టి తవ్వకాలకు పర్మిషన్ తీసుకున్నామంటూ, ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందంటూ, భారీ యంత్రాల సహాయంతో ఐదు, ఆరు మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలు చేస్తున్నరు. ప్రభుత్వం మట్టి తవ్వకాలకు రెండు, మూడు ఫీట్ల వరకు పర్మిషన్ ఇస్తే, ప్రభుత్వ ఇచ్చిన కొలతలను ధిక్కరించి చేస్తున్నారు. మండపాక లో జరిగే మట్టి తవ్వకాలను తక్షణమే పర్మిషన్ క్యాన్సల్ చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా నాయకులు సంబంధిత ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతరులుగానే భావించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన విషయం విధితమే, పర్మిషన్ పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ చేయడానికి నిషేధిత ప్రాంతంగా ఏజెన్సీ ప్రాంతం ఉంది. తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తే పిసా గ్రామసభ ద్వారా చేసినట్లయితే, ఆదివాసుల హక్కులు, చట్టాలు, రక్షించబడతాయని ఆయన అన్నారు.