మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 25 : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో ఆబియన్ యాత్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వనమా గాంధీ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా టిపిసిసిమెంబర్, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి పాల్గొని,శనివారం మండల కేంద్రంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గురించి వివరించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐసీసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందేశ కరపత్రాలు పంచుతూ,2024 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ,ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ,పోడు భూములకు హక్కుపత్రాలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ధరణి పోర్టల్ రద్దు,సొంత స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు,ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షలు,ఇందిరమ్మ రైతు భరోసా క్రింద సంవత్సరానికి ఎకరానికి 15000 రూపాయలు,అన్ని పంటలను గిట్టుబాటు ధరలతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిశెట్టి సత్యప్రసాద్ దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావా రామయ్య,మండల ఓబీసీ అధ్యక్షుడు గోళ్ళ ముత్తయ్య,ఇనుగంటి ప్రసాద్,వేముల కోటేశ్వరరావు,దోసపాటి రాంబాబు,ఇనుపనూరి జమలయ్య,సయ్యద్ అహ్మద్,కాలోజీ నరసింహారావు,లకావత్ చెన్నారావు,వీరబోయిన వెంకటేశ్వర్లు,కొత్తగుండ్ల మహేష్,సతీష్,సిద్దిల సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
