మన్యం న్యూస్ మణుగూరు టౌన్:2023 మార్చ్ 25
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనవారం మణుగూరు జిఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏరియా జిఎం దుర్గం రామచందర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్ మాట్లాడుతూ,మణుగూరు ఏరియాలో దాదాపు 200 లకు పైగా జనరల్ మజ్దూర్లు ఏరియా లోనీ వివిధ గనులలో, డిపార్ట్మెంట్లలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ ఉపరితల జనరల్ మజ్దూర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.2021 సంవత్సరంలోని ఉపరితల జనరల్ మజ్దూర్ ఖాళీలను,మేనేజ్మెంట్ ఈ మధ్యనే భర్తీ చేసిందని,కానీ 2021 నుండి నేటి వరకు ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు.ఏరియా లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ లను,ఖాళీలు స్థానంలోనే డిప్యూటేషన్ పై పని చేస్తున్నారని,ఎక్కడ పనిచేస్తున్న వారిని అక్కడే ఉపరితల జనరల్ మజ్దూర్ గా పోస్టింగ్ ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమం ఆవుల.నాగరాజు, పిట్ సెక్రటరీలు జి.గంగాధర్ రావు,కోడిరెక్కల.శ్రీనివాసరావు, గుంపెన శ్రీనివాసరావు,ఆంథోని రవి కుమార్,సుధాకర్, సురేందర్,లింగమూర్తి,మన్నెం యోహాన్,షకీల్,అహ్మద్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.