మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
సీతారాంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని శనివారం వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఐటీసీ ఎం.ఎస్.కె సౌజన్యంతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవ వేడుకల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వి.ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని అంతర్గత శక్తులు వెలికి తీయటానికి ఇటువంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో నిర్వహించటం ఎంతో అవసరమని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల భౌతిక వసతులు ఏర్పాటు సహ పాఠ్యాంశాలపై పోటీలు నిర్వహించటం మంచి సంప్రదాయమని అన్నారు పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చిన దాత ఐటిసి ఎం ఎస్ కే సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఐ టి సి ఎం ఎస్ కే వాష్ ఐ ప్రతినిధులు వెంకట్ , నవీన్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, వీర ప్రసాద్ లు పాల్గొన్నారు.