మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి రాళ్ళవాగు చెక్‌డ్యాం వద్ద స్ధలాన్ని సోమవారం బిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, డైరెక్టర్లు కొండేరు రాము,కటకం గణేష్, పార్టీ యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.