మన్యం న్యూస్ దుమ్మగూడెం::
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడి ఆలయానికి అనుసంధానమైన పర్ణశాల పుణ్యక్షేత్రం కి ఈనెల 31వ తేదీన గవర్నర్ తమిళ్ సై సందర్శిస్తున్నట్లు తెలిసింది .ఇప్పటికే అధికారులు గవర్నర్ రాక సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నారు .మహా పుష్కర పట్టాభిషేకం వేడుకకు భద్రాచల పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం పర్ణశాల పుణ్యక్షేత్రం కూడా సందర్శిస్తారు. 1994 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణ కాంత్ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్ణశాల విచ్చేస్తున్న గవర్నర్గా తమిళసై కానున్నారు. ఇప్పటికే దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ఈనెల 30, 31 వ తేదీన పర్ణశాల ఆలయంలోని పరిసర ప్రాంతాల్లో రెండు రోజులు దుకాణాలు పెట్టవద్దని స్థానిక పోలీస్ శాఖ వారు దుకాణదారులకు తెలియజేశారు