మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన గద్దమడుగు గ్రామంలో 141 సిఆర్పిఎస్ బెటాలియన్ ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంతర్ ఆదేశాలపై దుమ్ముగూడెం పోలీస్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం 100 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అంతరం గ్రామంలోని యువతను ప్రోత్సహిస్తూ వారికి వాలీబాల్ క్యారం బోర్డ్ సెస్ బోర్డ్స్ క్రీడా పరికరాలను అందించారు అనంతరం ములకనాపల్లి కొత్త గుంపులు 50 కుటుంబాలకు కళాయిలు స్టీల్ కంటైనర్లు స్టీల్ గ్లాసులు ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జున్ దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్సై రవికుమార్ కేశవ సిఆర్పిఎఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ బి కల్పన దుమ్ముగూడెం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు