- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి.
- మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా.
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలని డిమాండ్.
మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 27, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం మండల కేంద్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై తక్షణమే ముఖ్యమంత్రి స్పందించాలని. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ కొట్లాడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అక్రమార్కులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారని, పల్లె నుండి పట్టణానికి వెళ్లి ఉద్యోగమే జీవితం గా చదివే విద్యార్థులకు ప్రభుత్వాలు గండి కొట్టే పరిస్థితిలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పై తక్షణమే ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా పేపర్ లీకేజ్ పై హైకోర్టు సెట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చూడాలని కోరారు