- ఇంటింటికి టిడిపి
- సభ్యత్వ నమోదు కార్యక్రమలో తెదేపా నేత అరేం రామయ్య
- ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని వెల్లడి
మన్యం న్యూస్: జూలూరుపాడు,మార్చి 27,తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి టిడిపి సభ్యత్వ నమోదు,కు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు ఆరెం రామయ్య తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కడియాల శ్రీనివాసరావు సభ్యత్వం తో ప్రారంభించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ తెదేపా పార్టీకి మండలంలో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందన్నారు.గత డిసెంబర్ లో ఖమ్మం లో జరిగిన తెలుగుదేశం పార్టీ సభతో నూతన జవసత్వాలతో పాటు, పునర్ వైభవం వచ్చిందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు గా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకున్న తరువాత, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలతో గ్రామ స్థాయిలో తీసుకు పోతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైరా నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని రామయ్య జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రైతు సంఘం మాజీ అధ్యక్షులు రోకటి రంగరావు, అశ్వారావుపేట తెదేపా ఇన్ చార్జ్ కట్రం స్వామి దొర, బిసి సెల్ జిల్లా నాయకులు వడ్డే వెంకట నారాయణ, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, చలమల గోవిందు, సాయిన్ని కృష్ణార్జునరావు, చావా వెంకటేశ్వర్లు, కోటం రాజు, పెంటికల వీరబాబు, కడియాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.