మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 27, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన దేవినేని లక్ష్మయ్య హేమలత దంపతుల కుమార్తె, నల్లూరి స్వాతి సూర్య భాస్కర్ (ఎన్నారై) దంపతులు సోమవారం నర్సాపురం గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేశారు. ఇటీవల స్వాతి తల్లి అనారోగ్యంతో మరణించడంతో తన తల్లి దేవినేని హేమలత జ్ఞాపకార్థం అందించడం జరిగిందని తెలిపారు. పల్లె ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేక, సుదూర ప్రాంతాలలో ఉన్న వారి బంధువులు కడసారి చూపుకు నోచుకోకుండానే అంత్యక్రియలు జరుగుతున్నందున, గ్రామంలో ధనిక, పేద ప్రజలకు ఏదో ఒకరోజు ఈ పరికరం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్ కట్రం మోహనరావు, ఉప సర్పంచ్ రవి, కార్యదర్శి తిరుపతి, కాజా రమేష్, చావా వెంకటరామారావు, బాదావత్ వెంకట్ రామ్, నాగ శ్రీనివాసరావు, లేళ్ల గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
